కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం 16/03/2026 ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు వరుపుల దుర్గవేణి తమ్మయ్యబాబు గారు, వరుపుల సాయి కిరణ్ …
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం 16/03/2026 ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు వరుపుల దుర్గవేణి తమ్మయ్యబాబు గారు, వరుపుల సాయి కిరణ్ గారు గ్రామాన్ని సందర్శించి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలోని హనుమంతుడు ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామ సెంటర్లో వరుపుల దుర్గవేణి గారి చేతుల మీదుగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వరుపుల దుర్గవేణి గారు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలను సభ్యత్వంలో చేర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలను వివరించి స్థానిక ప్రజలను ఉద్యమి సభ్యత్వంలో చేరేలా నాయకులు ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల అధ్యక్షులు మరియు జె. అన్నవరం ఉపసర్పంచ్ శ్రీ కాలారి శ్రీను గారు, తూర్పు లక్ష్మీపురం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వీరంరెడ్డి దొరబాబు గారు, పంతం చక్రవర్తి గారు, సమ్మెట దొరబాబు గారు పాల్గొన్నారు. అలాగే గ్రామ నాయకులు కాపారపు సురేష్ గారు, జె. అన్నవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కొండపల్లి గంగాధర్ గారు, కాలారి పెద్దబాబు గారు, దాసం చిన్న గారు, పినపర్తి సుబ్బారావు గారు, కాపారపు శ్రీను గారు, కసిరెడ్డి రాజా గారు, కాలారి కృష్ణ గారు తదితర నాయకులు హాజరయ్యారు.
అలాగే మర్రివీడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు నానిశెట్టి భవాని శంకర్ గారు, ఏలేశ్వరం మండలంలోని తూర్పు లక్ష్మీపురం, జె. అన్నవరం, మర్రివీడు, పరిమితటక తదితర గ్రామాల నుండి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు తమ్మయ్యబాబు గారి అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, నాయకులు మరియు కార్యకర్తల సమిష్టి కృషితో ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.