తమిళనాడుకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ Thanthi TV కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు తన వద్ద ఎలాంటి శక్తి లేదా పెద్ద నాయకులు లేకపోయినా ఖాళీ చేతులతో ప్రజల మధ్యకు వచ్చానని తెలిపారు. ఈ ప్రయాణంలో విజయాలు, పరాజయాలు రెండూ ఎదురైనా తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, తన సామర్థ్యానికి తగ్గట్టు ఉత్తమంగా పని చేశానని చెప్పారు.