హైదరాబాద్‌లో జరిగిన “ఉస్తాద్ భగత్ సింగ్” ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా మాట్లాడారు. కార్యక్రమానికి వచ్చిన అభిమానులకు, టీవీల్లో చూస్తున్న తెలుగు ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. తన జీవితంలో సినిమాకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పారు.
“నాకు అన్నం పెట్టింది సినిమా… ప్రజలకు సేవ చేసే గుర్తింపునిచ్చింది కూడా సినిమా” అని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే తన సినిమాలు మాత్రమే కాకుండా నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు అందరూ బాగుండాలని కోరుకుంటానని తెలిపారు. సినిమా విజయం పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని, తాము కష్టపడి పని చేయడమే తమ బాధ్యత అని అన్నారు
రాజకీయం
“నాకు అన్నం పెట్టింది సినిమా” – పవన్ కళ్యాణ్

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి79 వీక్షణలు