Thanthi TV కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ఒకే విధమైన వ్యూహం అన్ని చోట్ల పనిచేయదని ఆయన అన్నారు.
రాజకీయాల్లో విజయవంతం కావాలంటే ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. పార్టీని స్థాపించి ముందుకు తీసుకెళ్లడం సులభం కాదని, దానికి సమయం, సహనం మరియు కష్టపడి పని చేయాల్సి ఉంటుందని చెప్పారు.
తన సోదరుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించినప్పుడు ఒంటరిగా పోటీ చేసి మంచి ఓటు శాతం సాధించారని ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే ప్రతి నాయకుడు తన పరిస్థితులకు అనుగుణంగా తనదైన రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు.