పిఠాపురం నియోజకవర్గం నాయకులతో ముఖాముఖి
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కుమార్‌పురం లోని గోకులం గ్రాండ్ వద్ద కాకినాడ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన పిఠాపురం ని…
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కుమార్‌పురం లోని గోకులం గ్రాండ్ వద్ద కాకినాడ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇంచార్జ్‌లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు గారు ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉందని ప్రతి గ్రామంలో రోడ్లు,ప్రతి ఇంటికి అభివృద్ధి పథకాలు నిరంతరం కూటమి ప్రభుత్వంలో అందుతున్నాయని తెలియజేసారు.ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలలో పవన్ కళ్యాణ్ గారి కృషి విశేషమని తెలిపారు.పిఠాపురం నియోజకవర్గంలో
అలాగే, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి వార్డు స్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని దిశానిర్దేశం చేశారు.జనసేన పార్టీ లక్ష్యాలు ప్రజా సేవేనని, పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పిఠాపురం ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, ఓదురి కిషోర్,పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకాపల్లి దేవి సూర్యప్రకాష్,పిఠాపురం మండల జనసేన పార్టీ ఇంచార్జ్ వెన్న జగదీష్, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ డా. వరలక్ష్మి, గొల్లప్రోలు మండల ఇంచార్జి జ్యోతుల శ్రీనివాస్, వివిధ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు చల్ల లక్ష్మి, పెంకే జగదీశ్, సూరిశెట్టి జయకృష్ణ, దానం లాజర్ బాబు, మొగలి అప్పారావు,స్థానిక నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








