ఏపీ డిప్యూటీ సీఎం #PawanKalyan గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం సీఎం @ncbn గారి దృష్టికి రావడంతో ఆయన వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో మాట్లాడారు.

ఈ ఘటనలో పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ తీరును సీఎం తప్పు పట్టారు. ప్రొటోకాల్, ఫ్లెక్సీలపై ఫొటోల పేరుతో ఘర్షణపడటం సరికాదన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే పార్టీ పెద్దలకు, ప్రభుత్వం దృష్టికి
తీసుకురావాలని సూచించారు. బహిరంగంగా
గొడవపడటం వల్ల లాభం ఉండదన్నారు. ఇలాంటి ఘటనలు క్యాడర్కు తప్పుడు సంకేతాలు పంపుతాయన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పల్లా శ్రీనివాస్ కు సూచించారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు తగిన సూచనలు చేయాలని
ఆదేశించారు.