ప్రోటోకాల్ నేపద్యం లో జరిగిన వివాదంలో
ఈరోజు బయట వాళ్లకి టీడీపీ కనుక వర్మ చెడుగా,జనసేన కనుక పెండం దొరబాబు మంచిగా కనిపించవచ్చు కానీ వర్మ చెప్పినట్లు పిఠాపురం లో నిజమైన జనసేన కార్యకర్తలు ఎవరు అస్సలు? 2014 లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెడితే 2024 ఎలక్షన్స్ వరకు పార్టీని మోసింది ఎవ్వరు అస్సలు ఇవ్వని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుసు.పార్టీ నీ మోసింది సాధారణ యువకులు. ఆరోజుల్లో బి.టెక్ ,డిగ్రీ లాంటి చదువుతున్న యువకులు మా అన్నయ్య పార్టీ అంటూ ప్రతి గ్రామంలో కుల మతాలకు అతీతంగా సాధారణ యువకులు వాళ్లకి తోడైన జనసేన వీరమహిళలు ఎన్నో సేవా కార్యక్రమాలు తో ప్రజా పోరాటాలు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పిలుపు ఇచ్చిన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పిఠాపురం లో జనసేన కార్యక్రమాలను రాష్ట్రంలో రెపరెపలు ఆడించారు. 2014 నుంచి సోషల్ మీడియా నీ తిరిగే వేస్తే అందరికీ కనిపిస్తారు . కొందరు పార్టీ తీరు నచ్చక దూరం అయితే మరికొందరు వృత్తి రీత్యా దూరంగా ఉంటూ పార్టీ కి ఎద్దోక రూపంలో సేవ చేస్తున్నారు . 2024 లో పార్టీ అధికారం లోకి వచ్చాక కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది. మరికొందరు ఈ ఆర్థిక బలమైన రాజకీయ ఆధిపత్య పోరులో నిలబడలేక పార్టీకి దూరం గా ఉంటూ తమ పని తాము చేసుకుంటున్నారు . ఇప్పుడు ఉన్న చాలా మంది నాయకులు 2024 పార్టీ అధికారం లోకి వచ్చాక వచ్చిన వాళ్లే కనీసం పవన్ కళ్యాణ్ గారి పోటీ చేస్తునప్పుడు పక్కన కూడా లేరు . మరికొందరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించక వచ్చిన వాళ్లే. అంత ఎందుకు ఇప్పుడు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ ప్రెసిడెంట్లు గా ఉన్న వాళ్ళు ఈ మధ్య వచ్చిన వాళ్లే.

వర్మ టికెట్ రాకపోతే చేసిన హంగామా వీడియోలు
జనసేన శ్రేణులు షేర్ చేస్తుంటే
ysrcp లో ఉన్నప్పుడు పెండం దొరబాబు నుంచి చాలా మంది నాయకులు పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గారిని ఒడిస్తామన్నారు ఇప్పుడు వర్మ అనుచరులు ఆ వీడియోలు షేర్ చెస్తున్నారు.

మీడియాలో జబ్బలు ఎగరవేస్తున్నట్లు ఏ ఒక్క నాయకుడు వల్ల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లో గెలవలేదు. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గారి నీ గెలిపించింది ఆయన వ్యక్తిత్వం మరియు పిఠాపురం ప్రజల అభిమానం మాత్రమే .2019 లో పిఠాపురం నుంచే పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారినీ ఇక్కడ ప్రజలు ఎంతగానో కోరారు .పోటీ చేసి ఉంటే మరోలా వుందును ఇప్పుడు ఉన్న పరిస్థితి.2029 లో కూడా పవన్ కళ్యాణ్ గారి నీ గెలిపించేది ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు మరియు పిఠాపురం ప్రజల నమ్మకం