ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగిన విషయం తెలిసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు స్పందించారు. పవన్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్, షర్మిల గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు ఉన్నా, వ్యక్తిగత విషయాల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కనిపించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పవన్ గారు డాక్టర్ల సలహా మేరకు 10 రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు.