పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం దగ్గర నుంచి మీ వైఖరి వింతగానే ఉంది. ఏదో రకంగా రచ్చ చేయడమే మీ పనిగా కన్పిస్తోంది.
ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫ్లెక్సీలో ఫోటోల గురించి రగడ సృష్టించడం ఏమిటండి ?
Pawan Kalyan గారు ఈ రెండేళ్లలో రూ 600కోట్ల అభివృద్ధి పనులు పిఠాపురం నియోజక వర్గంలో చేపట్టారు. ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు కదా.
అయినా చీటికీ మాటికీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేలా వర్మగారి ప్రవర్తన ఉంది.
పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే, JanaSena Party అధినేత, ఎన్డీయేలో భాగస్వామి అనే విషయం మరిచిపోయారా?
జనసేన అధినేత ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే ఇలా వ్యవహరిస్తే దాని అర్ధం ఏమనుకోవాలి. ఇప్పటికీ వర్మ గారి గురించి జనాలు రకరకాలుగా అనుకుంటున్నారు. కూటమిలో చిచ్చు పెట్టేలా వర్మగారి వ్యవహారం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే వ్యవహారం కనబడుతోంది.
ఏమైనా తేడాలుంటే, మీ పార్టీలో మాట్లాడుకోవాలి కానీ, ఇలా వ్యవహరించి, వార్తలకు ఎక్కడం సబబు కాదు. ఇప్పటికైనా తీరు మార్చుకోండి వర్మగారు.
రాజకీయం
వర్మగారు అసలు మీ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావడం లేదు -ముద్రగడ కుమార్తె క్రాంతి

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి13 వీక్షణలు