ప్రజల ఆశలు, ఆకాంక్షలను అసెంబ్లీలో ప్రతిబింబిద్దాం-జనసేన
రాష్ట్ర ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బలంగా పనిచేయాలని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అసెంబ్లీలో జరిగిన జనసేన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన సూచనలు చేశారు. ప్రజల సమస్యలను అ…
రాష్ట్ర ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బలంగా పనిచేయాలని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అసెంబ్లీలో జరిగిన జనసేన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన సూచనలు చేశారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రతిబింబించేలా పనిచేయాలని, నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో మంచి స్పందన వస్తోందని, మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.








