కాకినాడ జిల్లా ప్రత్తిపాడు POC మేడిశెట్టి సూర్యకిరణ్ కంటే “కత్తిపూడి బాబీ” పేరే రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితం అని ఏపీ టూరిజం డైరెక్టర్ గంటా స్వరూప దేవి తెలిపారు. బాబీ గారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్ర కార్పొరేషన్‌లలో చైర్మన్‌లు, డైరెక్టర్లుగా నియమితులైన వారందరిని ఆహ్వానించి సత్కరించడం అభినందనీయమన్నారు. మెగా అభిమాని గా ప్రారంభించి ఎన్నో పోరాటాల తర్వాత నాయకుడిగా ఎదిగిన బాబీ, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.