రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ‘హనుమాన్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. మానవ–వన్యప్రాణి సంఘర్షణ తగ్గించడం లక్ష్యంగా 100 ర్యాపిడ్ రెస్పాన్స్, రెస్క్యూ వాహనాలను ప్రారంభించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజల రక్షణ, పంటలు–పశుసంపద సంరక్షణ, గాయపడిన వన్యప్రాణులకు వైద్యసహాయం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమన్నారు.

వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం అందజేస్తామని తెలిపారు. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. గ్రామ స్థాయిలో ‘వజ్ర’ బృందాలను ఏర్పాటు చేసి తక్షణ స్పందన చర్యలు తీసుకుంటామని, ఏఐ సాంకేతికతతో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు.