మన ధర్మాన్ని రక్షించేందుకు లేచి నిలబడాల్సిన సమయం ఇది. ప్రపంచంలో ఇతర మతాలపై దాడులు జరిగితే వెంటనే గ్లోబల్ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. కానీ హిందువులు లేదా మన పవిత్ర సంప్రదాయాలు లక్ష్యంగా మారితే ఎందుకు నిశ్శబ్దం? పాలస్తీనా, ఇరాన్ ఘటనలపై సంఘీభావం చూపేవారు, హిందూ విశ్వాసాల విషయంలో సెక్యులరిజం పేరుతో మౌనం వహించడం సరైంది కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, సెక్యులరిజం అందరికీ సమానంగా వర్తించాలి.