వరుపుల దుర్గవేణి తమ్మయ్యబాబు నేతృత్వంలో జనసేన సభ్యత్వ కార్యక్రమం జోరుగా
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వాలు నమోద కార్యక్రమం నిర్వహించారు.ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు వరుపుల దుర్గవేణి తమ్మయ్యబాబు గారు, వరుపుల సాయి కిరణ్ గారు గ్రామాన్ని సందర్శించి కార్యక్రమాల్లో పాల్గొన్నా…
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వాలు నమోద కార్యక్రమం నిర్వహించారు.ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు వరుపుల దుర్గవేణి తమ్మయ్యబాబు గారు, వరుపుల సాయి కిరణ్ గారు గ్రామాన్ని సందర్శించి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలోని నేరేలమ్మ అమ్మవారు దర్శించుకున్నారు. అనంతరం గ్రామ సెంటర్లో వరుపుల దుర్గవేణి గారి చేతుల మీదుగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వరుపుల దుర్గవేణి గారు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలను సభ్యత్వంలో చేర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలను వివరించి స్థానిక ప్రజలను ఉద్యమి సభ్యత్వంలో చేరేలా నాయకులు ప్రోత్సహించారు.
తదితర గ్రామాల నుండి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు తమ్మయ్యబాబు గారి అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








