రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ప్రజలు పుకార్లను నమ్మవద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రస్తుతం రోజువారీ డిమాండ్ కంటే ఎక్కువే (సగటున 2.92 లక్షలు) సిలిండర్లను సరఫరా చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇప్పటికే 616 కేసులు నమోదు చేసి 2500 సిలిండర్లను సీజ్ చేశామని మనోహర్ గారు తెలిపారు. గృహ వినియోగ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులు ఓటిపి (OTP) ద్వారానే డెలివరీ తీసుకోవాలని ఆయన సూచించారు