జనసేన పార్టీ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రయాణంపై స్పందించారు. ఎలాంటి అధికార ఆశలు లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని, తన శక్తి మేరకు పనిచేశానని తెలిపారు. “నాకు పశ్చాత్తాపం లేదు… వైఫల్యాలే నాకు బలం” అని అన్నారు.
రాజకీయాలు మరియు సినిమాల మధ్య సమతుల్యం కష్టమని, అయినా ప్రజల కోసం రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తానన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తోందని చెప్పారు.
సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ, ఆదాయానికి మించి ఖర్చు చేస్తే రాష్ట్రాలకు ఆర్థిక సమస్యలు వస్తాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వాల్లో అభిప్రాయ భేదాలు సహజమని, కానీ సహకారంతో ముందుకు వెళ్లవచ్చన్నారు.
తమిళ నటుడు విజయ్ రాజకీయాలపై స్పందిస్తూ, “ఒక్కోరికి ఒక్కో పరిస్థితి ఉంటుంది. రాజకీయాల్లో నిలవాలంటే సమయం, సహనం అవసరం. ప్రజల మధ్య ఉండాలి” అని సూచించారు.
ముఖ్యమంత్రి పదవి లక్ష్యం కాదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్, “జీవితం నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ నా ప్రయాణం కొనసాగుతుంది” అని అన్నారు.
రాజకీయం
“ప్రజల కోసమే నా ప్రయాణం… విజయ్ కష్టపడాలి” — పవన్ కళ్యాణ్

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి60 వీక్షణలు