“పెదవి దాటని మాటకు నువ్వు రాజువి… పెదవి దాటిన మాటకు నువ్వు బానిసవి” — ఈ మాటలు రాజకీయాల్లో చాలా అరుదుగా నిజమవుతాయి. ఎందుకంటే ఈ కాలంలో హామీలు ఇవ్వడం ఒక సంప్రదాయం, కానీ వాటిని నిలబెట్టుకోవడం మాత్రం చాలా మందికి అలవాటు కాదు.
అలాంటి సమయంలో మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడి కథగా నిలిచింది…
“పెదవి దాటని మాటకు నువ్వు రాజువి… పెదవి దాటిన మాటకు నువ్వు బానిసవి” — ఈ మాటలు రాజకీయాల్లో చాలా అరుదుగా నిజమవుతాయి. ఎందుకంటే ఈ కాలంలో హామీలు ఇవ్వడం ఒక సంప్రదాయం, కానీ వాటిని నిలబెట్టుకోవడం మాత్రం చాలా మందికి అలవాటు కాదు.
అలాంటి సమయంలో మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడి కథగా నిలిచింది జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రయాణం.
జనసేన పార్టీ పుష్కర కాలం పూర్తి చేసుకుని 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు ఒక ప్రత్యేక సిరీస్‌ను ప్రకటించారు. ఈ సిరీస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం గా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా “జనసేనాని ఇచ్చిన మాట” అనే తొలి ఎపిసోడ్ విడుదలైంది.
ఈ కథలో ప్రధానంగా నిలిచింది కాకినాడ SEZ భూముల సమస్య. భవిష్యత్తు కోసం, పరిశ్రమలు వస్తాయని ఆశతో 1551 మంది రైతులు 2180 ఎకరాల భూమిని వదులుకున్నారు. కానీ సంవత్సరాలు గడిచినా ఆ భూములు నిరుపయోగంగా మిగిలిపోయాయి. రైతుల ఆశలు ఆవిరైపోయాయి… వారి గళం ఎవరికీ వినిపించలేదు.
అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. “మీకు న్యాయం జరిగే వరకు నేను మీతోనే ఉంటాను” అని హామీ ఇచ్చారు. ఆ మాటను మాటగానే కాకుండా బాధ్యతగా తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వడం ద్వారా రెండు దశాబ్దాల వారి బాధకు ముగింపు పలికారు. ఆ రోజు రైతుల కళ్లల్లో కనిపించిన ఆనందం… ఒక నాయకుడు మాట నిలబెట్టుకున్నందుకు వచ్చిన గౌరవం.
ఇక ప్రజల ఆరోగ్యాన్ని కూడా హక్కుగా భావించిన ఆయన, ప్రతి కుటుంబానికి ₹25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే ఆరోగ్య భీమా పథకాన్ని ముందుకు తీసుకువచ్చారు. పేద, మధ్యతరగతి ప్రజలు కూడా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం పొందాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా, ట్రాన్స్పోర్ట్ రంగంపై భారంగా మారిన గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించి లక్షలాది మంది వాహన యజమానులకు ఊరట కలిగించారు. గతంలో భారీగా పెరిగిన పన్నులను తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడం ద్వారా వ్యాపారుల సమస్యలను తగ్గించారు.
ఈ మొత్తం ప్రయాణం ఒకే విషయాన్ని చెబుతోంది — మాట ఇచ్చి మరిచిపోయే నాయకుడు కాదు… మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడు. రాజకీయాల్లో నమ్మకం ఇంకా బతికే ఉందని నిరూపించిన కథ ఇదే పవన్ కళ్యాణ్ గారి కథే ఇది