ఆంధ్ర యూనివర్సిటీలో జనసేనాని : "మీలో ఉన్నది న్యూక్లియర్ ఎనర్జీ.. దేశ భవిష్యత్తు మీరే!"
విశాఖపట్నం (JspNews): విద్యా కుసుమాల నిలయం, శతాబ్దాల చరిత్ర గల ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో జనసేనాని, ఏపీ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగంతో విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. 'శతాబ్ది మహోత్సవ' ముగింపు వేడుకల…
విశాఖపట్నం (JspNews): విద్యా కుసుమాల నిలయం, శతాబ్దాల చరిత్ర గల ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో జనసేనాని, ఏపీ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగంతో విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. 'శతాబ్ది మహోత్సవ' ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, యూనివర్సిటీ లోగో అర్థం నుంచి నేటి యువత బాధ్యత వరకు ప్రతి అంశాన్ని ఎంతో లోతుగా వివరించారు.
ప్రసంగంలోని పవర్ఫుల్ పాయింట్స్:
వారసత్వానికి వందనం: "నేను ఇక్కడ అతిథిగా రావడానికి అర్హుడిని కాదేమో అనిపిస్తుంది. మనం గౌరవించాల్సింది నా హీరోయిజాన్ని కాదు, ఈ సంస్థకు పునాది వేసిన డాక్టర్ సి.ఆర్. రెడ్డి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, నోబెల్ విజేత సర్ సి.వి. రామన్ వంటి మేధావులను" అంటూ వారి పాదాలకు ప్రణామం చేశారు.
విద్యే అసలైన ఆయుధం: నెల్సన్ మండేలా మాటలను గుర్తు చేస్తూ.. ప్రపంచాన్ని మార్చగల ఏకైక శక్తి ఒక్క విద్యకే ఉందని, ఆ విద్యను కేవలం వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా సమాజ సేవకు కూడా ఉపయోగించాలని కోరారు.
బలమైన ఐడియాలజీని ఎంచుకోండి: "ఏ భావజాలాన్ని (Ideology) గుడ్డిగా నమ్మకండి. అది సమాజానికి, ధర్మానికి, దేశ సమగ్రతకు ఎంతవరకు ఉపయోగపడుతుందో పరీక్షించండి. పొలిటికల్ పార్టీలతో సంబంధం ఉన్నా లేకపోయినా, రాజకీయాల్లో మీకంటూ ఒక గొంతు ఉండాలి" అని దిశానిర్దేశం చేశారు.
నా గెలుపోటముల కంటే మీ భవిష్యత్తే ముఖ్యం: "రాజకీయాల్లో ఓటమికి సిద్ధపడే నేను అడుగుపెట్టాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే హాట్ పొటాటోలా పక్కన పెట్టేయండి. కానీ మీ భవిష్యత్తు కోసం మీరు పోరాడండి" అని భావోద్వేగంతో చెప్పారు.
యూనివర్సిటీ లోగో అర్థం: లోగోలోని సూర్యుడు జ్ఞానోదయాన్ని, తామర పువ్వు లక్ష్మీ-సరస్వతుల కలయికను, రెండు పాములు విజ్ఞానాన్ని కాపాడే రక్షకులను సూచిస్తాయని వివరిస్తూ, అక్షరమే అసలైన శక్తి అని గుర్తు చేశారు.








