జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 'జనవాణి' కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను నేతలకు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు గారు ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వచ్చిన ప్రతి విన్నపాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గడసాల అప్పారావు, వీర మహిళ ప్రాంతీయ సమన్వయకర్త శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి, మరియు లీగల్ సెల్ ప్రతినిధి శ్రీమతి కరణం కళావతి తదితరులు పాల్గొన్నారు. బాధితులకు భరోసా కల్పిస్తూ, జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని నేతలు స్పష్టం చేశారు.