అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, నవంబర్ 5న యథావిధిగా పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. చాలా జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు నివేదించారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది.