అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.

తొలి విడత – నవంబర్ 26: కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఎంపిక చేసిన మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

రెండో విడత – నవంబర్ 29: అందిన మండలాలవారీ షెడ్యూల్ ప్రకారం కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, జగ్గంపేట, తొండంగి, పెద్దాపురం, గండేపల్లి మండలాల్లో పోలింగ్ జరగనుంది.

మూడో విడత – డిసెంబర్ 2: తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కిర్లంపూడి, ఏలేశ్వరం మండలాలను మూడో విడతలో పేర్కొన్నారు.

ప్రతి విడతలో ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపికకు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించనున్నారు. సర్పంచ్‌కు తెలుపు, వార్డు సభ్యులకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు వినియోగించనున్నారు.