స్థానిక సంస్థల ఎన్నికల కూటమి సీట్ల పంపకంలో జనసేనకు కొన్ని జిల్లాల్లో ఒక్క పట్టణ స్థానిక సంస్థ కూడా దక్కలేదు. ప్రచారంలో ఉన్న జాబితా ప్రకారం అనకాపల్లి, బాపట్ల, నెల్లూరు, కడప, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో జనసేనకు సున్నా కేటాయింపులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 25 స్థానాలు దక్కినా కొన్ని జిల్లాల్లో ప్రాతినిధ్యం లేకపోవడం చర్చనీయాంశమైంది.