కూటమి సీట్ల పంపకంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తం 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనసేనకు 7, టీడీపీకి 5 స్థానాలు కేటాయించారు. తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, ముమ్మిడివరం, అమలాపురం, నిడదవోలు జనసేనకు దక్కగా.. ఏలేశ్వరం, పెద్దాపురం, రామచంద్రపురం, మండపేట, కొవ్వూరు టీడీపీకి కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి ఎక్కువ స్థానాలు దక్కినా ఉమ్మడి తూర్పుగోదావరిలో జనసేనకు అధిక కేటాయింపులు జరగడం విశేషం.
రాజకీయం
ఉమ్మడి తూర్పుగోదావరిలో టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ మున్సిపల్ స్థానాలు!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి46 వీక్షణలు