స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకం ఆసక్తికరంగా మారింది. పిఠాపురం, గొల్లప్రోలు రెండు స్థానాలూ జనసేనకే కేటాయించే అవకాశముందని JSPNews ముందుగానే వెల్లడించింది. తాజాగా వెలువడిన కూటమి జాబితాలోనూ ఈ రెండు స్థానాలు జనసేనకే దక్కాయి. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రెండు మున్సిపల్ స్థానాలూ జనసేనకు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.