కొత్తపల్లి మండలం, కొండెవరం పరిధిలో రూ. 58 లక్షలతో మంజూరైన పీబీసీ మెయిన్ కెనాల్ గట్టు బలోపేతం, రాయూరుపు హెడ్ మరమ్మతులు, వజ్ర కాలువ బల్లకట్టు పనులపై గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ గారు ఇరిగేషన్ అధికారులతో కలిసి సమీక్షించారు. ఆయన రైతుల అభిప్రాయాలు సేకరించి, పనులు మొదలుపెట్టేందుకు ప్రణాళికను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ AE, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్, జనసేన నాయకులు, రైతులు, లస్కర్లు పాల్గొన్నారు.