పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడలో పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార సోదరులు, ఆడపడుచులను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ₹90 లక్షల బీమాను 18 మంది మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు అందించారు (ఒకొక్కరికి ₹5 లక్షలు). ₹323 కోట్లతో కేంద్రం సహకారంతో ఉప్పాడలో రీటైనింగ్ వాల్ పూర్తి చేస్తామన్నారు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ డిజైన్ లోపాలను ₹98 కోట్లతో సవరిస్తామని తెలిపారు. మత్స్యకారుల సమస్యలపై 100 రోజుల్లో ప్రణాళిక అమలు చేస్తామన్నారు. పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ ఆదేశించారు.