ఉప్పాడ: ఉప్పాడ–కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్‌చార్జ్ రావు అక్షయ్ వారి జన్మదినం సందర్భంగా సోమవారం ఉప్పాడ అన్న క్యాంటీన్‌లో మధ్యాహ్న భోజనానికి అవసరమైన నగదును కాకి బాబీ వారి ఆధ్వర్యంలో చెల్లించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప్పాడ–కొత్తపల్లి మండల జనసేన పార్టీ వైస్ ఇన్‌చార్జ్ దొడ్డి దుర్గాప్రసాద్, జనసేన నాయకులు ఇస్సాక్, లోకేష్, రామ్ మనోజ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రావు అక్షయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అన్న క్యాంటీన్‌లో భోజనానికి ఆర్థిక సహకారం అందించడం ద్వారా సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.