రాకోట గ్రామంలో హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం రేకుల షెడ్డులో కొనసాగుతున్న విషయాన్ని గమనించి, దేవాదాయ శాఖ సహకారంతో భజన మందిరంగా అభివృద్ధి చేసేందుకు రూ.20 లక్షలు కేటాయించారు. గ్రామస్థుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.