రాకోట పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను చూసి గిరిజన మహిళ రేవు గంగభవ భావోద్వేగానికి గురయ్యారు. సినిమాల్లో, టీవీల్లో మాత్రమే చూసిన మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తామని అనుకోలేదన్నారు. మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. తమ ప్రాంతంలోని రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.