స్థానిక సంస్థల నిర్వహణ కమిటీలో అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు కృతజ్ఞతలు స్థానిక సంస్థల నిర్వహణ కమిటీలో అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జనసేన నాయకులు కుంచా అంజిబాబు పేర్కొన్నారు. విశాఖపట్నం రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, జనసైనికులు మరియు కూటమి నాయకులతో సమన్వయంతో పనిచేస్తానని అంజిబాబు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. అలాగే నిర్వాహక దళ గా బొట్టా పాలవెల్లి, సపోర్టింగ్ టీం ములగపాక పైడ్రాజు, కంచా మణికంఠ లను నియమించారు
ఈ సందర్భంగా తనకు సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
— కుంచా అంజిబాబు
జనసేన
రాజకీయం
మాడుగల నియోజకవర్గం సమన్వయకర్తగా అంజిబాబు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి33 వీక్షణలు