పాతపట్నం నియోజకవర్గంలో దేవాలయ కూల్చివేత ఘటనపై జనసేన నేత రాయపాటి అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే ప్రతి అభివృద్ధి పనిని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకుంటారని, అలాంటప్పుడు ప్రభుత్వ భూమిలో ఉన్న దేవాలయం కూల్చివేతకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.
అధికారులు, స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే దేవాలయాన్ని కూల్చివేశారా? లేక తెలిసే ఈ చర్య జరిగిందా? అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు జరిగిన సమయంలో అక్కడ ఉన్న బాధ్యులు ఎందుకు స్పందించలేదని, వాస్తవాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు.
పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఎలాంటి అధికారిక పదవి లేని వ్యక్తి చెప్పిందనే కారణంతో అధికారులు దేవాలయాన్ని కూల్చివేస్తారా అని ప్రశ్నించిన రాయపాటి అరుణ.. ఈ ఘటనపై పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయం
పాతపట్నం దేవాలయ కూల్చివేతపై జనసేన నేత రాయపాటి అరుణ ఘాటు వ్యాఖ్యలు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి54 వీక్షణలు