కె.కోటపాడు మండలం చౌడువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో జనసేన నాయకులు కుంచా అంజిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. మెగా పీటీఎం కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడి విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చౌడువాడ గ్రామ సర్పంచ్ దాడి ఎరుగునాయుడు, పీఎసీఎస్ చైర్మన్ రాజనారాయణమూర్తి, చౌడువాడ జనసేన నాయకులు నాగులపల్లి మల్లయ్యుడు, కుంచ మనిశంకర్, కుటమి నాయకులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజకీయం
చౌడువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం 4.0 కార్యక్రమం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి29 వీక్షణలు