కె.కోటపాడు రామకృష్ణ ఫంక్షన్హాల్ లో శుక్రవారం నిర్వహించిన "ప్రజా దర్బార్"లో మండలంలోని మేజర్ పంచాయతీ గ్రామం చౌడువాడ అభివృద్ధికి సంబంధించి పలు అర్జీలు అందచేశారు. ఈ విషయాన్ని మండల జనసేన పార్టీ సమాచారం సేకరణ కమిటీ జిల్లా సభ్యులు కుంచా అంజిబాబు తెలిపారు. వీటిపై జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ స్పందించి పరిష్కారం నిమిత్తం అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఆదేశించారని అంజిబాబు చెప్పారు. అధికార్లు కూడా త్వరలో చౌడువాడ గ్రామంను సందర్శిస్తామన్నారని అంజిబాబు చెప్పారు.