డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన ఆరోపణలు చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటూ క్షమాపణలు ప్రకటించారు.
గతంలో వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారంటూ నాగేశ్వర్ రావు ఒక వీడియోలో వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ తప్పుడు ప్రచారంపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. కాకినాడ సర్పవరం, ఇంద్రపాలెంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో జనసేన నేతలు ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
కేసులు గట్టిగా తగలడంతో లైవ్ డిబేట్లో స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఒక తప్పుడు సోర్స్ (సమాచారం) వల్ల తాను ఆ వ్యాఖ్యలు చేశానని, ముందే క్రాస్ చెక్ చేసుకోకపోవడం తన తప్పేనని ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్‌కు, జనసేన నాయకులకు క్షమాపణలు చెబుతూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
రాజకీయం
పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం.. తోక ముడిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్!

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి21 వీక్షణలు