ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ తీర్థ మహోత్సవం సందర్భంగా కె.కోటపాడు మండల హైస్కూల్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మండల జనసేన ఇన్చార్జ్ కుంచా అంజిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు.
కార్యక్రమానికి జనసేన సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు వేగి శివాజీ, మణికుమార్, వెంకట్, జగదీష్ తమ సహాయ సహకారాలు అందించారు. అలాగే మండలంలోని జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గంగు నాయుడు, శ్రీను, బాల, గోపి తదితరులు పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
రాజకీయం
కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి21 వీక్షణలు