భావి భారత పౌరులైన Gen Z యువతతో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జరిపిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ స్పందనను పొందుతోంది.

“జనసేనాని విత్ Gen Z” పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో యువతలో ఉత్సాహం నెలకొంది.

⚡ ప్రోమోలోని పవర్‌ఫుల్ పాయింట్స్:

నాయకత్వం మీలోనే ఉంది:
“నాయకత్వం కోసం ఇతరుల వైపు చూడకండి. మీ సమస్యలను ఎవరో వచ్చి పరిష్కరిస్తారని ఎదురుచూడకండి.. మీరే ఆ నాయకులు కావాలి” అంటూ యువతలో స్ఫూర్తి నింపారు.

బాధ్యత (Responsibility):
“ఈ తరం (Gen Z) అద్భుతమైన పని చేస్తోంది. నేను ఒకే మాటలో చెప్పాలంటే.. అది బాధ్యత. ఇండియన్స్ ఫ్యూచర్‌ని కాపాడే వాల్యూస్ మీలోనే ఉన్నాయి” అని పేర్కొన్నారు.

ఓటు - అవినీతి:
డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడం, అమ్మడం వంటి కుళ్లిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించారు.

మహారాష్ట్ర & శివాజీ మహారాజ్:
“ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి పవర్‌ఫుల్ లీడర్లను ప్రపంచానికి అందించిన నేల మహారాష్ట్ర. మీలాంటి బలమైన నాయకత్వం ఇప్పుడు దేశానికి చాలా అవసరం” అని అన్నారు.

పాచిపేట ఉదాహరణ:
“పాచిపేటలో నీళ్లు ఉంటాయి.. కానీ ప్రజలు ఇబ్బంది పడుతుంటే మనం ఎందుకు ఇలా ఉన్నాం? మనం ఏదో ఒకటి చేయాలి కదా!” అని ప్రజల పట్ల ఉండాల్సిన బాధ్యత గురించి మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ యువతలో విస్తృత చర్చకు దారితీస్తోంది. 🚩