ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) గారి ఆధ్వర్యంలో వివిధ మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణలు నిర్వహించారు.
శంఖవరం మండలం కత్తిపూడి మరియు శంఖవరం గ్రామాల్లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
అదే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. సి.రాయవరం శివారులోని స్వామి దయానంద ఆశ్రమంలో అనాధ పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. సిరిపురం, యర్రవరం, లింగంపర్తి, తిరుమాలి గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేసి కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.
అలాగే ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి, ఒమ్మంగి, వెంకటనగరం గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేశారు. శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో నిరాశ్రయ పేదలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో జెండా ఆవిష్కరణతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన నాలుగు మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ కార్యవర్గ సభ్యులు, ఉద్యమి సభ్యత్వ సాధకులు, నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు మరియు ముఖ్యంగా జనసైనికులకు పార్టీ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
జనసేన పార్టీ
ప్రత్తిపాడు నియోజకవర్గం
రాజకీయం
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఘనంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి67 వీక్షణలు