ఆంధ్రప్రదేశ్‌ను ప్రభావితం చేస్తున్న ‘అర్నబ్’ తుపానుకు బంగ్లాదేశ్ పేరు సూచించింది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఆధ్వర్యంలో 13 దేశాలు సూచించిన 169 పేర్ల జాబితా నుంచి వరుసగా పేర్లు కేటాయిస్తారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపానులకు ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ పేర్లు ప్రకటిస్తుంది. హెచ్చరికలు ప్రజలకు సులభంగా చేరేందుకే ఈ విధానం!