ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 13 మంది బాధితుల కుటుంబాలకు కొరికాన ఫౌండేషన్ అండగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ గారు ఫౌండేషన్ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన సభ్యత్వం గడువు ముగిసిన అనంతరం ప్రమాదాలకు గురై బీమా పొందలేని పరిస్థితుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని ఆయన ముందుకు వచ్చారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలు, పీవోసీలు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచిన కొరికాన ఫౌండేషన్ సేవలను పలువురు అభినందించారు.