కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
కాకినాడ,: తుని మండలం రావికంపాడు వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడం పట్ల కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భవానీ భక్తుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
ఈ సందర్భంగా కాలినడకన విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భవానీ భక్తులు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సూచించారు.
రాజకీయం
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి27 వీక్షణలు