పిఠాపురం పాడా కార్యాలయంలో అక్టోబర్ 19న జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రాజెక్టు డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ్ ప్రసాద్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అర్జీదారులు కార్యాలయానికి రావద్దని, ఫిర్యాదులను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.