ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం చుట్టూ రాజకీయ ఉత్కంఠ నెలకొంది. జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లికార్జున నాయకర్ సతీమణి స్వప్న నాయకర్ అక్టోబర్ 18న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌పై తన అభిమానం ఎప్పటికీ ఉంటుందని చెబుతూనే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. జనసైనికులతో భారీ ర్యాలీకి పిలుపునివ్వడంతో కూటమి సీట్ల సర్దుబాటుపై ఆసక్తి పెరిగింది.