పిఠాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని జనసేన పార్టీ మార్చింది. తొలుత డాక్టర్ బీరా విజయశేఖర్ పేరును ప్రకటించిన పార్టీ, తాజాగా విడుదల చేసిన మలి జాబితాలో దానం లాజర్ బాబు పేరును ఖరారు చేసింది. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదంతో ఈ మార్పును ప్రకటించారు.