టీ20 క్రికెట్ ప్రపంచకప్ తుది పోరులో ఘన విజయం సాధించి విజేతగా నిలిచిన భారత జట్టుకి హృదయపూర్వక అభినందనలు. మ్యాచ్ లో తొలి నుంచి ఆధిపత్యం చాటిన మన జట్టు సాధించిన ఈ విజయం క్రీడాభిమానులకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సభ్యులు తమ క్రీడా ప్రతిభను చాటారు. సంజు శాంసన్, జస్పీత్ బుమ్రా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలకు ప్రత్యేక అభినందనలు. ఈ పోటీలో పోరాడిన శాంటర్న్ నాయకత్వంలోని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సభ్యుల ప్రతిభ విస్మరించలేనిది. వారికి అభినందనలు. ఆ జట్టులోని జేమ్స్ నీషమ్ బౌలింగ్, సీఫెర్ట్ బ్యాటింగ్ ను క్రికెట్ అభిమానులు మరచిపోలేరని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు