జనసేన తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. గతంలో తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.