జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదంతో పిఠాపురం మున్సిపల్ అభ్యర్థిగా డాక్టర్ బీరా విజయ్ శేఖర్, గొల్లప్రోలు అభ్యర్థిగా కడారి తమ్మయ్య నాయుడు పేర్లను ప్రకటించింది. దీంతో రెండు మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది