స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి జనసైనికుడికి, వీర మహిళలకు జనసేన నేత నాగబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికలు జనసైనికుల ఆత్మగౌరవానికి సంబంధించినవని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమిలోని అన్ని పార్టీలతో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.