జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మాడుగుల నియోజకవర్గ ముఖ్య నాయకులతో చీడికాడ మండలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చీడికాడ మండల అధ్యక్షులు గంట్ల వరహమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే, విశాఖ జిల్లా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రమేష్ బాబు గారు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడంలో సభ్యత్వ నమోదు కీలకమని తెలిపారు. నాయకులు గ్రామాల్లో ప్రజలను కలుసుకుని అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో చోడవరం జనసేన ఇంచార్జ్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయం
మాడుగులలో జనసేన సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి10 వీక్షణలు