విజయనగరం మండలం గుంకలాం గ్రామంలో “జనసేన ఉద్యమి” సభ్యత్వం, ఊరు వాడ జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి యశస్వి గారు హాజరయ్యారు. మండల నాయకులు బోగి సాయి కుమార్ గారు గ్రామ నడిబొడ్డులో వేదికను ఏర్పాటు చేయగా, ర్యాలీతో కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ ప్రజలు, పెద్దలు, యువత ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వం నమోదు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గా చేస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తూ మరింత మంది జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.