జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇంచార్జి రేఖా గౌడ్ గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై సాధకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.